తిరుపతిలో అనేకమంది పేదల ఇళ్లు వరద నీటిలో నానుతూనే ఉన్నాయి: పవన్ కల్యాణ్
- తిరుపతిలో నాదెండ్ల మనోహర్ పర్యటన
- వరద బాధితులకు పరామర్శ
- స్పందించిన పవన్ కల్యాణ్
- బాధితులు కన్నీళ్లతో సమస్యలు చెప్పుకున్నారని వెల్లడి
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇవాళ తిరుపతిలో పర్యటించారు. ఈ పర్యటనపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. బాధిత ప్రాంతాల్లో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించి బాధితుల గోడు విన్నారని వెల్లడించారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అందుతున్న సాయం వివరాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం మినహా ఎలాంటి సాయం అందడంలేదని బాధితులు వాపోయినట్టు తెలిసిందని పవన్ వివరించారు.
"తిరుపతిలో ఇప్పటికీ అనేకమంది పేదల ఇళ్లు వరద నీటిలోనే నానుతూనే ఉన్నాయి. పలు కాలనీలకు చెందిన ప్రజలు కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారు. జనసేన పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు, దుప్పట్లు అందించారు. ప్రభుత్వం నుంచి న్యాయమైన పరిహారం అందేలా బాధితుల పక్షాన నిలిచేందుకు జనసేన సిద్ధంగా ఉంది" అని తెలిపారు.