ప్రపంచ బ్యాంకుతో రుణ ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం

  • రూ.1,860 కోట్ల మేర రుణ ఒప్పందం
  • విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం రుణం
  • కేంద్ర ఆర్థిక శాఖ అధికారుల సమక్షంలో ఒప్పందం
  • 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ది
ఏపీ సర్కారు ప్రపంచ బ్యాంకుతో తాజాగా రూ.1,860 కోట్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో ఈ రుణ ఒప్పందంపై ఏపీ అధికారులు సంతకాలు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రవ్యాప్తంగా 45 వేల పాఠశాలల్లోని 50 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ ఒప్పందం ద్వారా లబ్దిచేకూరనుందని వివరించాయి.


More Telugu News