రివేంజ్ డ్రామా నేపథ్యంలో కొరటాల మూవీ: ఎన్టీఆర్
- జనవరి 7వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్'
- ఫిబ్రవరి 4వ తేదీన 'ఆచార్య' రిలీజ్
- ఆ తరువాత ఎన్టీఆర్ - కొరటాల ప్రాజెక్ట్
- అక్టోబర్లో ప్రశాంత్ నీల్ తో సినిమా
రాజమౌళి దర్శకత్వంలో చరణ్ తో కలిసి ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సినిమాను ఆయన కొరటాల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ రావడం వలన, సహజంగానే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథా నేపథ్యం ఏమై ఉంటుంది? ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనే విషయాలు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.
" కొరటాలతో చేయనున్న సినిమా రివేంజ్ డ్రామా .. ఇది ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది. ఆరు .. ఏడు నెలల్లో ఈ సినిమా షూటింగును పూర్తి చేయాలని అనుకున్నాము. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అక్టోబర్లో సెట్స్ పైకి వెళుతుంది. ఇది 'కేజీఎఫ్' తరహాలో సాగే భారీ యాక్షన్ సినిమా" అని చెప్పుకొచ్చాడు.