ఏఐజీ ఆసుపత్రి నుంచి ఏపీ గవర్నర్ హరిచందన్ డిశ్చార్జి
- ఇటీవల కరోనా బారినపడిన ఏపీ గవర్నర్
- హైదరాబాదులో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స
- తాజా పరీక్షలో కరోనా నెగెటివ్
- విజయవాడకు రానున్న గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆయన ఈ మధ్యాహ్నం హైదరాబాదులోని ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
కొన్ని రోజుల కిందట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జలుబు, దగ్గు వంటి లక్షణాలతో బాధపడుతుండడంతో వైద్య పరీక్షలు చేయగా, కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయన అర్థాంగి సుప్రవ హరిచందన్ కూడా కరోనా బారినపడ్డారు. దాంతో మెరుగైన చికిత్స కోసం వారిద్దరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించారు. కొవిడ్ పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆయనను వైద్యులు డిశ్చార్జి చేశారు. కాసేపట్లో విజయవాడ రానున్న ఆయన నేరుగా రాజ్ భవన్ కు వెళ్లనున్నారు.