యమునా ఎక్స్‌ప్రెస్ వేకి వాజ్‌పేయి పేరు.. కేంద్రం నిర్ణయం!

  • ఈ నెల 25న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన
  • హాజరుకానున్న మోదీ, యోగి, బీజేపీ ముఖ్యనేతలు
  • అదే రోజు పేరు మార్పుపై అధికార ప్రకటన
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం పేర్లు మార్చుకుంటూ పోతోంది. తాజాగా ఆ రాష్ట్రంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25న గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని జెవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగానే యుమునా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

విమానాశ్రయ శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీకి చెందిన ఇతర ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్ వే పేరును మారుస్తూ అధికారికంగా ప్రకటన చేయనున్నట్టు పేరు వెల్లడించడానికి ఇష్టపడని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు.



More Telugu News