అన్ని లెక్కలు వేసుకునే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు: పయ్యావుల

  • వికేంద్రీకరణ బిల్లు రద్దుపై సీఎం జగన్ ప్రకటన
  • కోర్టులో వాదనలు కొలిక్కి వస్తున్నాయన్న పయ్యావుల
  • త్వరలోనే తీర్పు వస్తుందని వెల్లడి
  • అందుకే సీఎం జగన్ త్వరపడ్డారని వివరణ
మూడు రాజధానులు, సీఆర్డీయే రద్దు నిర్ణయాలపై ఏపీ సర్కారు వెనక్కి తగ్గడంపై టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తన అభిప్రాయాలు వెల్లడించారు. అన్ని లెక్కలు వేసుకునే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణపై కోర్టులో వాదనలు ఓ కొలిక్కి వస్తున్నాయని, తీర్పు వచ్చే సమయం దగ్గరపడిందని అన్నారు. అందుకే సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశారని పయ్యావుల వివరించారు. ఇప్పుడు మెరుగైన బిల్లు తీసుకువస్తాం అంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో మరింత గందరగోళం నెలకొందని తెలిపారు.

మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయానికి బాధ్యులెవరు? ఇప్పటివరకు జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. అయితే ఇవాళ అసెంబ్లీలో చేసిన ప్రకటన నేపథ్యంలో గతంలో చేసిన చట్టాలు తప్పని జగన్ అంగీకరించినట్టేనని పయ్యావుల స్పష్టం చేశారు.


More Telugu News