బీఎండబ్ల్యూ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్... ధర రూ.8 లక్షల పైనే!
- సీఈ-04 పేరిట బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్
- కేవలం అరగంటలోనే ఫాస్ట్ చార్జింగ్
- ఒక్కసారి చార్జ్ చేస్తే 150 కిమీ ప్రయాణం
- గంటకు 120 కిమీ టాప్ స్పీడ్
జర్మనీ ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు మాత్రమే కాదు హైఎండ్ బైకుల విపణిలోనూ రాణిస్తోంది. తాజాగా బీఎండబ్ల్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకువస్తోంది. ఈ మోడల్ పేరు సీఈ-04. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఇది విపణిలోకి రానుంది. చూడ్డానికి హైబ్రిడ్ తరహాలో కనిపిస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గంటకు 120 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకెళుతుంది.
దీంట్లో రెండు చార్జింగ్ మోడ్స్ ఇచ్చారు. నార్మల్ మోడ్ లో చార్జింగ్ కు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని, ఫాస్ట్ మోడ్ లో కేవలం అరగంటలోనే చార్జింగ్ అవుతుందని కంపెనీ వర్గాలంటున్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే అత్యధికంగా 150 కిమీ దూరం ప్రయాణించవచ్చు.
దీని ధర కూడా బీఎండబ్ల్యూ బ్రాండ్ కు తగినట్టుగానే ఉంది. ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ.8 లక్షల పైనే ఉంటుందట. అయితే ఇది భారత మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనేది ఇంకా తెలియరాలేదు.