మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై చంద్రబాబు స్పందన
- ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన
- వికేంద్రీకరణ బిల్లు ఉపసంహరణ
- సీఆర్డీయే రద్దు బిల్లు ఉపసంహరణ
- మరో బిల్లు తెస్తామన్న సీఎం జగన్
- రాష్ట్రానికి ఎంతో నష్టమన్న చంద్రబాబు
మూడు రాజధానుల బిల్లుతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లును కూడా ఉపసంహరించుకుంటున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. త్వరలోనే సమగ్ర వివరాలతో కూడిన కొత్త బిల్లుతో వస్తామని, మూడు రాజధానుల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సీఎం జగన్ వైఖరితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయని తెలిపారు. రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అటు, మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై రాజధాని రైతుల తరఫు న్యాయవాదులు స్పందించారు. మరోసారి బిల్లు తెస్తామని చెప్పడం దుర్మార్గం అని వ్యాఖ్యానించారు. గతంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని రాజధానిని నిర్ణయించారని, రైతులను మోసం చేయడం ఇప్పటికైనా మానుకోవాలని అన్నారు.