రేపు హిందీ 'జెర్సీ' నుంచి ట్రైలర్ రిలీజ్!
- తెలుగులో హిట్ కొట్టిన 'జెర్సీ'
- అదే కథతో .. అదే టైటిల్ తో బాలీవుడ్ కి
- కథానాయకుడిగా షాహిద్ కపూర్
- డిసెంబర్ 31వ తేదీన సినిమా విడుదల
నాని కథానాయకుడిగా కొంతకాలం క్రితం తెలుగులో 'జెర్సీ' సినిమా వచ్చింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, భారీ విజయాన్ని నమోదు చేసింది. క్రికెట్ తో ముడిపడిన ఎమోషనల్ స్టోరీ ఇది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన గౌతమ్, అదే కథను బాలీవుడ్ కి తీసుకెళ్లాడు. షాహిద్ కపూర్ హీరోగా ఆయన ఈ సినిమాను రూపొందించాడు.
ఆయన సరసన మృణాలిని ఠాకూర్ కనిపించనుంది. పంకజ్ కపూర్ .. శిశిర్ శర్మ .. శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో, డిసెంబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5:30 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ .. దిల్ రాజు .. అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు .
ఆయన సరసన మృణాలిని ఠాకూర్ కనిపించనుంది. పంకజ్ కపూర్ .. శిశిర్ శర్మ .. శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా మారడంతో, డిసెంబర్ 31వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. రేపు సాయంత్రం 5:30 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ .. దిల్ రాజు .. అమన్ గిల్ నిర్మాతలుగా వ్యవహరించారు