ఇది ఎవరికీ భయపడి తీసుకున్న నిర్ణయం కాదు: మంత్రి బొత్స
- వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న ప్రభుత్వం
- సీఆర్డీయే రద్దు నిర్ణయం వెనక్కి
- సభలో సీఎం జగన్ ప్రకటన
- చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామన్న బొత్స
మూడు రాజధానుల బిల్లును ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్టు సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు మూడు రాజధానులపై వెనక్కి తగ్గబోమని తెలిపారు. మూడు రాజధానులపై టీడీపీ దుష్ప్రచారం చేసిందని అన్నారు. వికేంద్రీకరణే సరైనది అని తాము నమ్ముతున్నామని, అదే వైసీపీ ప్రభుత్వ విధానమని వెల్లడించారు.
అయితే, బిల్లుల ఉపసంహరణ నిర్ణయం ఎవరికీ భయపడి తీసుకున్నది కాదని, తాము చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామని బొత్స స్పష్టం చేశారు. చట్ట, న్యాయపరమైన అంశాలకు పరిష్కారాలు తెస్తామని, అందరి అపోహలు, అనుమానాలు తీరుస్తామని చెప్పారు. మరింత మెరుగైన బిల్లుతో మళ్లీ ముందుకొస్తామని తెలిపారు.