10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలు తెలుస్తాయి: కొడాలి నాని
- మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయి
- దీని వల్ల ఇవి న్యాయస్థానాల్లో నిలువలేకపోతున్నాయి
- జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదు
రాజధాని వికేంద్రీకరణ చట్టాలను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఏపీ హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక సమస్యలు ఉన్నాయని... ఈ కారణంగానే న్యాయస్థానంలో బిల్లులు నిలువలేకపోతున్నాయని చెప్పారు.
సీఎం జగన్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని అన్నారు. మరో 10 నిమిషాలు ఆగితే అన్ని విషయాలపై క్లారిటీ వస్తుందని చెప్పారు. కొడాలి నాని వ్యాఖ్యలతో జనాల్లో ఉత్కంఠ మరింత పెరుగుతోంది. అసలు ఏం జరగబోతోందని, జగన్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి పెరుగుతోంది.