ఇండియా క్లీన్ స్వీప్ చేయడం బాగుంది... కానీ,..: రాహుల్ ద్రావిడ్

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ను గెలవడం బాగుంది
  • అయితే ఆటగాళ్లు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి
  • యువ క్రీడాకారులు రాణించడం సంతోషంగా ఉంది
న్యూజిలాండ్ లో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో నూతన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఆటగాడు చాలా బాగా ఆడాడని చెప్పారు. తాను బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి సిరీస్ నే ఘనంగా ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. ఈ విజయంతో భారత ఆటగాళ్లు పొంగిపోకూడదని... ప్లేయర్లు నేలపైనే ఉండాలని చెప్పారు. టీమిండియా క్లీన్ స్వీప్ చేయడం బాగుందని... అయితే ఆటగాళ్లు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తెలిపారు.
 
ఈ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న పలువురు యువ క్రీడాకారులు రాణించడం శుభపరిణామమని ద్రావిడ్ అన్నారు. ఇకపై కూడా వారికి మరిన్ని అవకాశాలను ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇక్కడి నుంచి ప్రపంచకప్ వరకు ఎంతో ప్రయాణం ఉందని అన్నారు. నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఆటగాళ్లను త్వరగా నిద్రపొమ్మని చెపుతానని... ఎందుకంటే టెస్టు మ్యాచ్ లు ఉదయం 9.30 గంటలకే ప్రారంభమవుతాయని... ఆటగాళ్లు ఉదయం 7.30కే మేల్కోవాలని తెలిపారు.


More Telugu News