ఏపీ కేబినెట్‌ అత్యవసర సమావేశం.. మూడు రాజధానులపై నిర్ణయం తీసుకునే అవకాశం!

  • అసెంబ్లీ సమావేశాల ముగింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం
  • సోలార్ పవర్, వరద బాధితులకు సాయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం
  • ఈరోజు ఆలస్యంగా ప్రారంభమైన అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ అత్యవసరంగా భేటీ అయింది. భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను ఈరోజే ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కేబినెట్ మీటింగ్ లో అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు మూడు రాజధానుల విషయంపై కూడా ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

సోలాల్ పవర్ కొనుగోలు, వరద బాధితులకు రూ. 2 వేల సాయం అందించే అంశాలపై కూడా కేబినెట్ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈనాటి అసెంబ్లీ సమావేశాలు 10 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు వరద ప్రభావిత ప్రాతాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పలు ప్రశ్నలపై చర్చను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.


More Telugu News