ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచిన ఎయిర్ టెల్!
- 20 నుంచి 25 శాతం వరకు టారిఫ్ పెంపు
- నవంబర్ 26 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఛార్జీలు
- ఎయిర్ టెల్ నిర్ణయంతో లాభాల్లో ట్రేడ్ అవుతున్న ఆ సంస్థ షేర్లు
ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ ఈరోజు కీలక ప్రకటన చేసింది. ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచుతున్నట్టు ప్రకటించింది. వాయిస్ ప్లాన్లపై 20 శాతం, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్ ప్లాన్లపై 25 శాతం వరకు టారిఫ్ పెంచుతున్నట్టు పేర్కొంది. నవంబర్ 26 నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఛార్జీల వల్ల ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) రూ. 200 నుంచి 300 వరకు చేర్చాలని భావిస్తున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది.
దీనివల్ల మూలధనంపై సరైన రాబడి ఉంటుందని... ఇది ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాకు దారితీస్తుందని చెప్పింది. ఆదాయం పెరగడం వల్ల స్పెక్ట్రం కొనుగోళ్లు, నెట్ వర్క్ కొనుగోళ్లలో పెట్టుబడులకు అవకాశం ఏర్పడుతుందని తెలిపింది. మన దేశంలో 5జీ అమలుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది. మరోవైపు ఎయిర్ టెల్ ప్రకటనతో ఆ కంపెనీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
మారనున్న ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ఛార్జీల వివరాలు: