ప్రతిపక్ష నేత వయసుకైనా గౌరవం ఇవ్వండి: ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

  • ప్రసంగాల పేరిట నాయకుల కుటుంబాల్లోని మహిళలను కించపరుస్తారా?
  • నాగరికతతో వ్యవహరించండి
  • అసెంబ్లీలో ఇలాంటి ఘటనలు సిగ్గుచేటు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ స్పందించారు. అసెంబ్లీలో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటన్న ఆయన.. రాజకీయ ప్రసంగాల పేరిట నాయకుల కుటుంబాల్లోని మహిళలను దూషించడం దారుణమైన విషయమన్నారు. ప్రతిపక్ష పార్టీని గౌరవించడం ఎలాగూ చేతకావడం లేదని, కనీసం నాగరికతతో అయినా వ్యవహరించాలని హితవు పలికారు. ప్రతిపక్ష నాయకుడి వయసుకైనా గౌరవం ఇవ్వాలని కోరారు.

మరోవైపు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి భార్య భువనేశ్వరిని అసెంబ్లీ వేదికగా వైసీపీ నేతలు కించపరిచారన్న ఆరోపణలపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ పరిణామాలపై పలువురు జాతీయ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నాయకులు, సినీ స్టార్లు చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు.


More Telugu News