రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నాం: సోము వీర్రాజు
- అమరావతి ఒక్కటే రాజధాని అంటూ రైతుల పాదయాత్ర
- మద్దతు పలికిన బీజేపీ
- నెల్లూరు జిల్లాలో పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలు
- రైతులతో కలిసి ముందుకు సాగుతామన్న సోము
అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ నేతలు నేడు రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద బీజేపీ, అమరావతి రైతుల ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని ఉద్ఘాటించారు. ఈ మాటకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. అందువల్లే అమరావతిలో అనేక పనులకు కేంద్రం నుంచి నిధులు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయాన్ని అమరావతిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. రైతుల పాదయాత్రలో చివరి వరకు బీజేపీ పాల్గొంటుందని వివరించారు.