ఏపీలో భారీ వర్షాలపై రాహుల్ గాంధీ స్పందన

  • బాధితులకు సాయమందించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచన
  • వరదలు తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని విచారం
  • ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతి
ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. అక్కడి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సహాయ చర్యల్లో పాల్గొనాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వరదలు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని, తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతిని తెలియజేశారు. వరద బాధితులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలు సాయం చేయాలని ఆయన సూచించారు.

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పటికే 20 మందికిపైగా చనిపోయారు. నదులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్నాయి. గ్రామాలు, నగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తిరుమల కొండపైనా ఎంత విధ్వంసం జరిగిందో తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి.


More Telugu News