రూ. 1.5 కోట్ల విలువైన పాము విషం విక్రయించే యత్నం.. ఇద్దరి అరెస్ట్

రూ. 1.5 కోట్ల విలువైన పాము విషం విక్రయించే యత్నం.. ఇద్దరి అరెస్ట్
  • ఒడిశాలోని దేవ్‌గఢ్ జిల్లా తరంగ్ గ్రామంలో ఘటన
  • పక్కా సమాచారంతో దాడిచేసిన పోలీసులు
  • లీటరు విషం స్వాధీనం
కోటిన్నర రూపాయల విలువైన పాము విషాన్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవ్‌గఢ్ జిల్లా తరంగ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాము విషం విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంపై దాడిచేసిన పోలీసులు సంబల్‌పూర్ జిల్లా సఖిపడకు చెందిన రంజన్ కుమార్ పాడి, సింధూరపంకకు చెందిన కైలాస్ సాహులను అరెస్ట్ చేశారు.

వారి నుంచి రూ. 1.5 కోట్ల విలువైన లీటరు విషాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విషాన్ని ఎక్కడి నుంచి సేకరించారు? ఎక్కడికి రవాణా చేస్తున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


More Telugu News