నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల

నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై తాజా బులెటిన్ విడుదల
  • సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత
  • అపోలో ఆసుపత్రికి తరలింపు
  • వెంటిలేటర్ పై చికిత్స
  • పలు అవయవాలు విఫలమయ్యాయన్న వైద్యులు
  • చికిత్సకు తగిన విధంగా స్పందించడం లేదని వెల్లడి
టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా వైద్యులు వెంటనే వెంటిలేటర్ అమర్చారు.

తాజాగా సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు. చికిత్సకు తగిన విధంగా స్పందించడం లేదని, ఆయన శరీరంలో పలు అవయవాలు విఫలం అయ్యాయని వైద్యులు వెల్లడించారు. సత్యనారాయణ కరోనా అనంతర సమస్యలతో బాధపడుతున్నారని ఆ బులెటిన్ లో పేర్కొన్నారు.


More Telugu News