వరద సహాయ చర్యల్లో అపశ్రుతి... తండ్రీకొడుకులను కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్
- ఏపీలో భారీ వర్షాలు
- నెల్లూరు జిల్లాలో వరదలు
- దామరమడుగు వద్ద తండ్రీకొడుకులను కాపాడిన కానిస్టేబుల్
- లైఫ్ జాకెట్ జారిపోవడంతో నీట మునక
నెల్లూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వరదలు సంభవించడంతో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఎస్డీఆర్ఎఫ్ కూడా రంగంలోకి దిగింది. అయితే జిల్లాలోని దామరమడుగు వద్ద తండ్రీకొడుకులను రక్షించిన శ్రీనివాసరావు అనే ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్, ఆపై ప్రమాదవశాత్తు మృతి చెందారు. వరదలో చిక్కుకున్న తండ్రీకొడుకులను కాపాడిన శ్రీనివాసరావు తాను నీటిలో మునిగిపోయారు.
ఆయన లైఫ్ జాకెట్ జారిపోవడంతో వరద ఉద్ధృతికి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రాణాలను కాపాడిన ఆ కానిస్టేబుల్ తన ప్రాణాన్ని కోల్పోవడం ఆ తండ్రీకొడుకులను కలచివేసింది. వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎస్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు భౌతికకాయానికి జిల్లా ఎస్పీ విజయరావు ఘననివాళి అర్పించారు.