శబరిమల యాత్ర నిలిపివేత.. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ

  • కేరళను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
  • ఉప్పొంగుతున్న పంబా నది
  • భక్తుల భద్రతరీత్యా యాత్ర నిలిపివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కూడా ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షాల కారణంగా పంబా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కక్కి-అనథోడ్ రిజర్వాయర్, పంబా డ్యామ్ లో వరద ప్రమాదకర స్థాయికి చేరడంతో గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శబరిమల యాత్రను అధికారులు నిలిపివేశారు. భక్తుల భద్రత దృష్ట్యా పంబ, శబరిమల యాత్రను నిలిపివేస్తున్నామని జిల్లా కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు తమిళనాడులో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువల్లూరు, వెల్లూరు తదితర జిల్లాల్లో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు చెన్నైలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు కర్ణాటక తీర ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


More Telugu News