'అన్నాత్తే' డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇవ్వనున్న రజనీ!

  • రజనీ నుంచి ఇటీవల వచ్చిన 'అన్నాత్తే'
  • తమిళ .. తెలుగు భాషల్లో లభించని ఆదరణ
  • శివ టేకింగ్ నచ్చిందని చెప్పిన రజనీ
  • ఇదే కాంబినేషన్ రిపీట్ అయ్యే ఛాన్స్
రజనీకాంత్ కథానాయకుడిగా శివ దర్శకత్వంలో ఈ దీపావళికి 'అన్నాత్తే' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా 'పెద్దన్న' పేరుతో పలకరించింది. సన్ పిక్చర్స్ వంటి పెద్ద బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా, తమిళంతో పాటు తెలుగులోను భారీ స్థాయిలో విడుదలైంది. కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

ఈ సినిమాలో కీలకమైన .. ముఖ్యమైన పాత్రలు ఎక్కువ. అందువలన స్టార్ హీరోలను .. హీరోయిన్లను పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. ఇది అన్నాచెల్లెళ్ల ఎమోషన్స్ కి సంబంధించిన కథ. 80 ల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. ఇలాంటి కథలను రజనీ ఇంతకుముందు చేశారు కూడా. అందువలన ఆదరిద్దామంటే ప్రేక్షకులకు కొత్త పాయింట్ కనిపించలేదు.

టాక్ పరంగా .. వసూళ్ల పరంగా ఈ సినిమా ఆశించిన స్థాయిలో దూసుకుపోకపోయినా, మళ్లీ శివకి ఛాన్స్ ఇవ్వాలని రజనీ నిర్ణయించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. తనని తెరపై శివ ప్రెజెంట్ చేసిన తీరు రజనీకి బాగా నచ్చిందట. అందువలన మరో కథను రెడీ చేసుకుని రమ్మని ఆయనకి చెప్పినట్టుగా అనుకుంటున్నారు. తనకి నచ్చిన దర్శకులతో ఎక్కువ సినిమాలు చేయడం రజనీకి మొదటి నుంచి అలవాటే.


More Telugu News