ఏపీ సీఎం ఇంటికి చినజీయర్ స్వామి.. పాదాభివందనం చేసిన జగన్

  • రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం
  • ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ఉత్సవాలు
  • చినజీయర్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు 
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి త్రిదండి చినజీయర్ స్వామి వెళ్లారు. సీఎంతో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. చినజీయర్ కు పాదాభివందనం చేసి, ఆశీర్వచనాలను అందుకున్నారు. చినజీయర్ తో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మై హోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరావు కూడా ఉన్నారు.


కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 14 వరకు సహస్రాబ్ది ఉత్సవాలను నిర్వహించనున్నారు. అందులో భాగంగా రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు 1035 కుంభాలతో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు, 108 దివ్యదేశ ప్రతిష్ఠ, కుంభాభిషేకాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా చినజీయర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే.




More Telugu News