మనదిక జిహాదీ దేశమే.. సాగు చట్టాల రద్దుపై కంగన
- ప్రభుత్వం కాకుండా వీధుల్లోని వారు చట్టాలు చేయడమా?
- ఇలాంటిది కావాలనుకుంటున్న వారికి శుభాకాంక్షలు
- ఆత్మసాక్షి గాఢ నిద్రలో ఉంటే లాఠీలు, నియంతృత్వమే పరిష్కారం
- ఇందిరాగాంధీ కోట్ ను పోస్ట్ చేసిన కంగనా రనౌత్
సాగు చట్టాల రద్దుపై బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమె స్పందించారు. వీధి పోరాటల శక్తి చాలా గొప్పదని మరోసారి నిరూపితమైందంటూ సాగు చట్టాల రద్దుపై స్పందించిన ఓ నెటిజన్ పోస్ట్ ను షేర్ చేసిన ఆమె వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.
పార్లమెంట్ కు ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా వీధుల్లోని వ్యక్తులు చట్టాలను చేయడం మొదలు పెడితే.. అది అక్షరాలా జిహాదీ దేశమే అవుతుందిక అని అన్నారు. ఇలాంటివి కావాలనుకుంటున్న వారందరికీ శుభాకాంక్షలంటూ కామెంట్ చేశారు. అంతేగాకుండా నేడు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఆమె ఫొటోను పోస్ట్ చేస్తూ.. 'దేశ ఆత్మసాక్షి గాఢమైన నిద్రలో ఉన్నప్పుడు లాఠీలు ప్రయోగించడం, నియంతృత్వాన్ని అమల్లోకి తేవడమే సరైన పరిష్కారం.. హ్యాపీ బర్త్ డే మేడమ్ ప్రైమ్ మినిస్టర్' అంటూ కంగన ట్వీట్ చేశారు.