సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- 'గాడ్ ఫాదర్'కి నయనతార ఖరారు
- అన్నపూర్ణాలో చరణ్, కియారా పాట
- నాగ చైతన్య సరసన తమిళ నటి
* చిరంజీవి సినిమాలో నయనతార ఎంపిక ఖరారైంది. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న 'గాడ్ ఫాదర్' చిత్రంలో కీలక పాత్రలో నయనతార నటిస్తుంది. ఆమె ఎంపికను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
* ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ తాజా షెడ్యూలు హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చరణ్, కియారా జంటపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
* అక్కినేని నాగ చైతన్య తొలిసారిగా వెబ్ సీరీస్ చేయనున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కోసం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సీరీస్ రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు తమిళ నటి ప్రియా భవానీ శంకర్ ను తాజాగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది.