ఇద్దరు వ్యాపారవేత్తలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి స్నేహ

  • ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీని నడుపుతున్న ఇద్దరు వ్యాపారవేత్తలు
  • తమ సంస్థలో పెట్టుబడి పెట్టాలని స్నేహకు ప్రతిపాదన
  • రూ.26 లక్షల పెట్టుబడి పెట్టిన స్నేహ
  • మోసం చేశారంటూ పోలీసులను ఆశ్రయించిన నటి
ప్రముఖ నటి స్నేహ చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలపై కణత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు వ్యాపారవేత్తలు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీని నడుపుతున్నారు. వారు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ రూ.26 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. అయితే, ఎంతకీ వాటా ఇవ్వకపోగా, తాను పెట్టుబడిగా పెట్టిన రూ.26 లక్షలు కూడా తిరిగి చెల్లించలేదని స్నేహ ఆరోపిస్తున్నారు.

తన డబ్బుపై వడ్డీ అయినా చెల్లించాలని కోరినా వారి నుంచి స్పందన రాలేదని, డబ్బు ఇవ్వాలని కోరడంతో బెదిరించారని, గట్టిగా అడగడంతో దాడికి దిగారని స్నేహ ఆరోపించారు. స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News