రాహుల్ ద్రావిడ్ టీమిండియా కోచ్ పదవిని స్వీకరించడం ఆశ్చర్యానికి గురిచేసింది: రికీ పాంటింగ్
- టీమిండియా కొత్త కోచ్ గా ద్రావిడ్
- ద్రావిడ్ పిల్లలు ఇంకా చిన్నవాళ్లేనన్న పాంటింగ్
- కోచ్ గా జట్టుతోనే అధిక సమయం ఉండాలని వెల్లడి
- కుటుంబం కోసం ఎక్కువ సమయం కేటాయించలేమని వివరణ
భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ టీమిండియా ప్రధాన కోచ్ గా నియమితుడవడం తెలిసిందే. ద్రావిడ్ నియామకంపై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ స్పందించాడు. ద్రావిడ్ టీమిండియా కోచ్ పదవిని చేపట్టడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని అన్నాడు. ద్రావిడ్ పిల్లలు ఇంకా చిన్నవాళ్లేనని, ఇలాంటి సమయంలో టీమిండియా కోచ్ వంటి పెద్ద బాధ్యతలు స్వీకరిస్తాడని తాను ఊహించలేదని వెల్లడించాడు. ఇంటిని వదిలి జట్టుతోనే అధిక సమయం గడపాల్సి ఉండడమే తన అభిప్రాయం వెనుక కారణమని పేర్కొన్నాడు.
ద్రావిడ్ టీమిండియా కోచ్ గా రావడంతో ఇప్పుడతని కుటుంబ జీవనం గురించి ఏంటో చెప్పలేమని అన్నాడు. అయితే తాను ఈ విషయంపై కొందరితో మాట్లాడానని, వారు మాత్రం ఈ పదవికి ద్రావిడే సరైనవాడన్న అభిప్రాయం వ్యక్తం చేశారని పాంటింగ్ వివరించాడు.
కాగా, టీమిండియా హెడ్ కోచ్ పదవికి తనను కూడా సంప్రదించారని, అయితే తాను ఆ ఆఫర్ ను తిరస్కరించానని ఈ ఆసీస్ దిగ్గజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా భారత క్రికెట్ కు చెందిన కొందరు వ్యక్తులు తనను కలిసి కోచ్ పదవి గురించి ప్రస్తావించారని, తాను టీమిండియా కోసం ఎక్కువ సమయం కేటాయించలేనన్న ఉద్దేశంతో ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదని తెలిపాడు.
పాంటింగ్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రధాన కోచ్ గా కొనసాగుతున్నాడు. ప్రతి సీజన్ కు మెరుగవుతున్న ఢిల్లీ జట్టు ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో సత్తా చాటి ప్లేఆఫ్స్ కు చేరడం తెలిసిందే.