ఈ నెల 23 వరకు కేసీఆర్ కు టైమ్ ఇస్తున్నాం: రేవంత్ రెడ్డి

  • బీజేపీ, టీఆర్ఎస్ రైతులను మోసం చేస్తున్నాయి
  • ఏసీలు పెట్టుకుని కేసీఆర్ ధర్నా చేశారు
  • పోరాటం చేయాలనుకునేవాళ్లు రైతుల కళ్లాలకు వెళ్లాలి
రైతులను కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఇందిరాపార్క్ దగ్గర సీఎం కేసీఆర్ ఏసీలు పెట్టుకుని ధర్నా చేశారని ఎద్దేవా చేశారు.

రైతుల పక్షాన పోరాటం చేయాలనుకునేవాళ్లు రైతుల కళ్లాలకు వెళ్లాలని అన్నారు. రేపటి నుంచి 23వ తేదీ వరకు కళ్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తుందని చెప్పారు. ధాన్యం కొనేందుకు ఈనెల 23 వరకు కేసీఆర్ కు సమయం ఇస్తామని... ఆ తర్వాత రైతులతో కలిసి ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి రైతు సమస్యలపై మోదీని నిలదీయాలని డిమాండ్ చేశారు.


More Telugu News