తెలంగాణకు గతంలోనే చెప్పాం... బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదు: కేంద్రం స్పష్టీకరణ

  • ధాన్యం కొనుగోలు డిమాండ్ తో కేసీఆర్ మహాధర్నా
  • దేశంలో వరిసాగు ఎక్కువైందన్న కేంద్రం
  • ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని వెల్లడి
  • పంట మార్పిడి అనివార్యమని స్పష్టీకరణ
ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఓవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ మహాధర్నా చేపడుతున్న తరుణంలోనే, కేంద్రం తమ వైఖరిని స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్ ను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని వెల్లడించింది. దేశంలో వరిసాగు ఎక్కువైందని, ధాన్యం నిల్వలు పెరిగిపోతున్నాయని వివరించింది.

దేశ అవసరాలకు మించి వరిసాగు చేపడుతున్నారని కేంద్రం పేర్కొంది. పంట మార్పిడి అనివార్యమని పునరుద్ఘాటించింది. వరిని తక్కువగానే పండించాలని తెలంగాణకు గతంలోనూ సూచించామని తెలిపింది. ఈ నేపథ్యంలో యాసంగి పంటను కూడా పరిమితంగానే కొంటామని స్పష్టం చేసింది. రబీలో ఎంత ధాన్యం కొనుగోలు చేసేది త్వరలో చెబుతామని వెల్లడించింది.


More Telugu News