సీఎం కేసీఆర్ ఏ సబ్జెక్టుపై ధర్నా చేస్తున్నారు?: ఎమ్మెల్యే రాజాసింగ్
- ధాన్యం కొనుగోలు అంశంలో కేసీఆర్ మహాధర్నా
- స్పందించిన రాజాసింగ్
- హుజూరాబాద్ లో ఓటమితో కేసీఆర్ ఉలిక్కిపడ్డారని ఎద్దేవా
- బీజేపీ ఎదుగుదలతో ఆందోళనకు గురవుతున్నారని విమర్శలు
కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు దిగడం తెలిసిందే. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. హుజూరాబాద్ లో బీజేపీ దెబ్బకు కేసీఆర్ ఉలికిపాటుకు గురయ్యారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ఏ సబ్జెక్టుపై ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు.
తెలంగాణలో బీజేపీ ఎదుగుదల భయాందోళనలు రేకెత్తిస్తున్నందునే కేసీఆర్ ఇవాళ రోడ్డు మీదికి వచ్చారని విమర్శించారు. ఇది ప్రారంభం మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలు అంతా చూస్తున్నారని, ధాన్యం కొనుగోలు అంశంలో ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో ప్రజలకు తెలుసని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు.