మహా ధర్నాలో కేసీఆర్.. యుద్ధం ప్రారంభమైందన్న సీఎం!
- రైతుల పట్ల కేంద్రం వ్యతిరేకతతో ఉందన్న కేసీఆర్
- వరి కొనాలని మోదీని కోరినా స్పందన లేదని మండిపాటు
- కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాడతామని వ్యాఖ్య
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై ఇక యుద్ధం ఆగబోదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రైతుల పట్ల కేంద్రం పూర్తి వ్యతిరేకతతో ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే తాము యుద్ధాన్ని ప్రారంభించామని... ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... రాబోయే రోజుల్లో యుద్ధాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నా కార్యక్రమంలో కేసీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
పంజాబ్ లో కొన్న విధంగానే తెలంగాణలో కూడా వరి ధాన్యాన్ని కొనాలని ప్రధాని మోదీని స్వయంగా కోరానని... అయినా మోదీ నుంచి ఉలుకు, పలుకు లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రైతులకు న్యాయం చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. గ్రామాలలో సైతం ధర్నాలు చేయాలని రైతులకు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి మన డిమాండ్లను సాధించుకుందామని చెప్పారు.