ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
- గత 24 గంటల్లో 11,919 కేసుల నమోదు
- మహమ్మారి నుంచి కోలుకున్న 11,242 మంది
- దేశంలోని యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,762
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 12,32,505 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా 11,919 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 11,242 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీల కంటే కొత్తగా నమోదైన కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా 470 మంది మృతి చెందారు. ఈ మరణాల్లో 61 కేరళలో సంభవించాయి. ఇప్పటి వరకు కరోనాతో దేశంలో మృతి చెందిన వారి సంఖ్య 4,64,623కి చేరుకుంది. మొత్తం 3.38 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,28,762 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే.. నిన్న 73.4 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 114 కోట్ల డోసుల వ్యాక్సిన్ ను వేశారు.