ఈ విషయంలో ఢిల్లీని దాటిపోయిన పాకిస్థాన్ నగరం లాహోర్!

  • అత్యంత కాలుష్యపూరిత నగరంగా లాహోర్
  • జాబితాలో మూడో స్థానంలో ఢిల్లీ
  • స్వచ్ఛమైన గాలి ఉన్న దేశాల్లో అత్యధికం యూరప్ లోనే
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలు వాతావరణ కాలుష్యంతో సతమతమవుతున్నాయి. పలు నగరాల్లో సాధారణ స్థాయుల కంటే అత్యధికంగా కాలుష్యం ఉంటోంది. పర్యావరణ పరిరక్షణను పట్టించుకోకుండా ఎన్నో దేశాలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అధిక మొత్తంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో స్వచ్ఛమైన గాలిని కలిగి ఉన్న దేశాలు యూరప్ లోనే ఎక్కువగా ఉన్నాయి.

మన దేశం విషయానికి వస్తే ఢిల్లీలో వాయు కాలుష్యం దారుణంగా ఉంది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మరోపక్క, కాలుష్యం విషయంలో ఢిల్లీ కంటే దారుణమైన స్థాయిలో పాకిస్థాన్ లోని లాహోర్ నగరం ఉంది. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నగరాల జాబితాలో లాహోర్ తొలి స్థానంలో ఉంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ సంస్థ ఐక్యూఎయిర్ తెలిపింది.

వాహనాలు, కర్మాగారాల నుంచి వెలువడుతున్న ప్రమాదకరమైన పొగ వలన గాలిలో కాలుష్యం దారుణంగా పెరిగిపోతోందని ఆ సంస్థ పేర్కొంది. ఈ కాలుష్యం వల్ల ప్రజల్లో శ్వాస సంబంధమైన ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.


More Telugu News