వైసీపీ నేతలు శునకానందంలో ఉన్నారు: నారా లోకేశ్

  • మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు
  • టీడీపీ పని అయిపోయిందంటున్న వైసీపీ నేతలు
  • కౌంటర్ ఇచ్చి, మండిపడిన నారా లోకేశ్  
ఏపీలో ఈరోజు మున్సిపల్, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధికార వైసీపీ దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. కుప్పం మున్సిపాలిటీని కూడా వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ పని అయిపోయిందని వైసీపీ నేతలు అంటుండగా... అక్రమాలకు పాల్పడి వైసీపీ గెలుపొందిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ వైసీపీపై మండిపడ్డారు. దొంగ ఓట్లు, వందల కోట్లు, గూండాగిరి, అధికారులు-పోలీసుల అండతో కుప్పంలో గెలిచామని... లోకేశ్ రెండు చెంపలను ప్రజలు పగలగొట్టారని వైసీపీ నేతలు శునకానందంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. 'రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఫ్యాన్ కి వ్యతిరేకంగా ఓటేసి జగన్ బట్టలూడదీసి వాయగొట్టారనేది బులుగు బుర్రలకు ఎప్పుడెక్కుతుందో' అని అన్నారు.


More Telugu News