10 పురపాలికలు వైసీపీ కైవసం!
- మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ హవా
- నెల్లూరు కార్పొరేషన్ లో 28 వార్డులు సొంతం
- కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్ లో వైసీపీ
ఏపీ పురపాలికల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటిదాకా అధికార పార్టీ 9 మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకుంది. కుప్పం, నెల్లూరు, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, గురజాల, బుచ్చిరెడ్డిపాలెం, దాచేపల్లిలో జయకేతనం ఎగురవేసింది.
ఇటు నెల్లూరు కార్పొరేషన్ లోనూ మెజారిటీ స్థానాలను గెలిచి.. దానిని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 24 డివిజన్లలో ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 54 వార్డులకుగానూ 8 డివిజన్లలో అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో 46 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. 28 వార్డులు వైసీపీ ఖాతాలో పడ్డాయి. దీంతో నెల్లూరు కార్పొరేషన్ కూడా వైసీపీ కైవసం కావడం లాంఛనమే అయింది.