చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే నమ్మలేదు: విజయసాయిరెడ్డి
- కుప్పం ఫలితాలపై స్పందన
- టీడీపీ కుప్పం కోట బద్దలైందని కామెంట్
- ఇప్పటికే మెజారిటీ స్థానాలు సాధించిన వైసీపీ
కుప్పంలో అత్యధిక స్థానాలను గెలవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ కుప్పంకోట బద్దలైందన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిందన్నారు.
దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఎన్నో ఏళ్లుగా గెలిపిస్తున్న ఆయన సొంత నియోజవకర్గంలోని ప్రజలే బాబును నమ్మలేదని ఈ ఫలితాలతో అర్థమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 15 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి చైర్ పర్సన్ పదవిని ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.