వైసీపీ వశమైన కమలాపురం, దాచేపల్లి నగర పంచాయతీలు
- టీడీపీ ఖాతాలో దర్శి నగర పంచాయతీ
- కుప్పంలో హోరాహోరీ
- దాచేపల్లిలో ఒక స్థానంలో నెగ్గిన జనసేన
నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతోపాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ ఉదయం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు ప్రారంభంమైంది. ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీని వైసీపీ కైవసం చేసుకుంది. 11 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, ఏడు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. జనసేన, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కో స్థానంలో విజయం సాధించారు.
మరోపక్క, ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీని టీడీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ 13 స్థానాల్లో టీడీపీ విజయం సాధించగా, వైసీపీ ఏడు స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక, కడప జిల్లా కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 20 వార్డుల్లో ఇప్పటికే 12 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. టీడీపీ ఒక్క వార్డులో విజయం సాధించింది.
మరోవైపు, కుప్పంలో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక్కడి ఫలితాల కోసం రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకల్లా తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.