మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామో, లేదో త్వరలో చూస్తారు: లోకేశ్ కు మంత్రి కన్నబాబు కౌంటర్
- మూడు రాజధానులు ఏర్పాటు చేయలేరన్న లోకేశ్
- కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామన్న కన్నబాబు
- అందుకు ప్రజామోదం కూడా ఉందని వ్యాఖ్య
- స్థానిక ఎన్నికల్లో తమకు 85 శాతం ఓట్లు వచ్చాయని వివరణ
ఏపీకి మూడు రాజధానుల అంశంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం అసాధ్యమని, వైసీపీ వల్ల కాదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు కన్నబాబు కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధే తమకు పరమావధి అని, అందుకే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేసి తీరుతామని, అది జరిగి తీరుతుందో లేదో త్వరలోనే చూస్తారని వ్యాఖ్యానించారు.
మూడు రాజధానుల విధానాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారని, స్థానిక సంస్థల్లో తమకు 85 శాతం ఓట్లు లభించడమే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం టీడీపీకి ఇష్టం లేదని కన్నబాబు విమర్శించారు.