'బంగార్రాజు' నుంచి వచ్చేస్తున్న నాగలక్ష్మి లుక్!
- 'బంగార్రాజు'గా నాగార్జున
- దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ
- గ్రామీణ యువతిగా కృతి శెట్టి
- ఎల్లుండి నాగలక్ష్మి లుక్ రివీల్
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా చకచకా షూటింగు జరువుకుంటోంది. 'బంగార్రాజు'గా నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ సందడి చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమాలో యువ జంటగా చైతూ .. కృతి శెట్టి కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాగలక్ష్మి పాత్రను రివీల్ చేయడానికి మేకర్స్ ఒక ముహూర్తం పెట్టారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 10:18 నిమిషాలకు నాగలక్ష్మి పాత్రను రివీల్ చేయనున్నట్టు చెప్పారు.
ఆకుపచ్చ గాజులను ధరించి .. రెండు చేతులతో నాగలక్ష్మి నమస్కరిస్తున్నట్టుగా ఒక ఫొటోను వదిలారు. ఆ ఫొటోను బట్టి ఆమె కృతి శెట్టి అనీ .. గ్రామీణ యువతి పాత్రను ఆమె పోషించిందనే విషయం అర్థమవుతోంది. కృతి శెట్టి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే షయం ఈ స్టిల్ ను బట్టి తెలిసిపోతోంది. ఇక ఈ సినిమా నుంచి స్వర్గానికి సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.