పని ప్రారంభించిన రాహుల్ ద్రావిడ్... కివీస్ తో సిరీస్ కు టీమిండియా కఠోర సాధన
- రేపటి నుంచి టీమిండియా, న్యూజిలాండ్ సిరీస్
- తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా సన్నాహాలు
- రోహిత్ శర్మకు త్రోడౌన్లు విసిరిన ద్రావిడ్
- కొత్త కోచ్, కొత్త కెప్టెన్ కలయికలో సిరీస్ కు సిద్ధమైన భారత్
టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ రంగంలోకి దిగాడు. ఈ నెల 17 నుంచి న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ జరగనుండగా, టీమిండియా ఆటగాళ్లతో ద్రావిడ్ సాధన చేయించాడు. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ తో కోచ్ గా రవిశాస్త్రి పదవీకాలం ముగియడంతో కొత్త కోచ్ గా ద్రావిడ్ నియమితుడయ్యాడు. అటు, విరాట్ కోహ్లీ కూడా టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోగా, నూతన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. కొత్త కెప్టెన్, కొత్త కోచ్ కాంబినేషన్ లో టీమిండియా కొత్త ప్రస్థానం ప్రారంభిస్తోంది.
ఈ నెల 17న భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత ఆటగాళ్లు సన్నాహాలు షురూ చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీసు చేస్తుండగా, ద్రావిడ్ స్వయంగా త్రోడౌన్లు విసిరి సహకరించాడు. ద్రావిడ్ సమక్షంలో భారత క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీసు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.