2022 టీ20 ప్రపంచకప్ టోర్నీ వేదికలు ఖరారు!

  • ప్రపంచకప్ ను నిర్వహించనున్న ఆస్ట్రేలియా
  • మొత్తం ఏడు వేదికల ఖరారు
  • ఫైనల్స్ కు ఆతిథ్యం ఇవ్వనున్న మెల్బోర్న్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించే వేదికలను ఐసీసీ అధికారులు ఖరారు చేశారు. మొత్తం 7 నగరాల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 45 మ్యాచ్ లు జరగనున్నాయి. ఇందుకు బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబార్ట్, పెర్త్, సిడ్నీ, మెల్బోర్న్ నగరాలను వేదికలుగా అధికారులు ప్రకటించారు. ఫైనల్స్ మ్యాచ్ కు మెల్బోర్న్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సెమీ ఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్ లో జరగనున్నాయి.

ఈ సందర్భంగా ఐసీసీ టోర్నీల పర్యవేక్షకుడు క్రిస్ టెట్లీ మాట్లాడుతూ, ఆస్ట్రేలియాలో మళ్లీ ఐసీసీ టోర్నీలు జరగనుండటం సంతోషంగా ఉందని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం తాము ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని అన్నారు. మరోవైపు ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలపడ్డాయి. ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.


More Telugu News