మానేరు వాగులో విద్యార్థుల గల్లంతుపై కేటీఆర్ దిగ్భ్రాంతి!

  • నీటిలో గల్లంతైన ఆరుగురు విద్యార్థులు
  • ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు లభ్యం
  • గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించిన కేటీఆర్
మానేరు వాగు చెక్ డ్యామ్ లో ఆరుగురు విద్యార్థులు గల్లంతయిన ఘటన అందరినీ కలచి వేస్తోంది. వీరి మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. నిన్న రాత్రి ఒక విద్యార్థి మృతదేహం లభించింది. అతన్ని 8వ తరగతి చదువుతున్న గణేశ్ గా గుర్తించారు. ఈ ఉదయం మరో మృతదేహం లభించగా... అతన్ని వెంకటసాయిగా గుర్తించారు. కాసేపటి క్రితం రాకేశ్ అనే విద్యార్థి మృతదేహం లభించింది. మిగిలిన విద్యార్థులు క్రాంతి, అజయ్, మనోజ్ కోసం సహాయకబృందాలు గాలింపు జరుపుతున్నాయి.

ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీతో ఈ ఉదయం ఆయన మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉండి గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆయనను ఆదేశించారు. డీఆర్ఎఫ్ అధికారులతో కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు గాలింపు చర్యలను కొనసాగిస్తున్న సిబ్బందికి సహకరించేందుకు హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్లను కూడా తీసుకెళ్తున్నారు.


More Telugu News