సంక్రాంతి తరువాతనే థియేటర్లకు 'విరాటపర్వం'!

  • ఓటీటీలో వచ్చిన వెంకటేశ్ 'నారప్ప'
  • అమెజాన్ ప్రైమ్ కి 'దృశ్యం 2'
  • 'విరాటపర్వం' రిలీజ్ పై సందేహాలు
  • థియేటర్లకే అన్నది లేటెస్ట్ టాక్  
రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' సినిమా రూపొందింది. ఈ సినిమాలో ఆయన నక్సలైట్ గా కనిపించనున్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సుధాకర్ చెరుకూరి - సురేశ్ బాబు నిర్మించారు. సురేశ్ బొబ్బిలి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగానే ఉంది.

ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. సురేశ్ బాబు నిర్మాతగా ఉన్న 'నారప్ప' ఓటీటీలోనే ప్రేక్షకులను పలకరించింది. ఇక ఆ తరువాత సినిమాగా రూపొందిన 'దృశ్యం 2' సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలోనే రానా 'భీమ్లా నాయక్' సినిమాను కూడా దాదాపు పూర్తిచేశాడు.

ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ లోగా 'విరాటపర్వం' ఓటీటీలో వచ్చేయవచ్చని అనుకుంటున్నారు. కానీ 'భీమ్లా నాయక్' రిలీజ్ తరువాత, 'విరాట పర్వం' సినిమాను థియేటర్లకే తీసుకురావాలనే ఆలోచనలో సురేశ్ బాబు ఉన్నారని  చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.


More Telugu News