మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి జ్యుడీషియల్ రిమాండ్

  • మనీలాండరింగ్ కేసులో 14 రోజుల రిమాండ్
  • జైల్లోని ఆహారాన్నే తీసుకోవాలని కోర్టు ఆదేశాలు
  • జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు కోర్టు అనుమతి    
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కు ముంబైలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కోర్టు షాకిచ్చింది. ఆయనకు రెండు వారాల పాటు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. అయితే, ఇంటి నుంచి ఆహారాన్ని తెప్పించుకునేందుకు చేసుకున్న విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు ఆహారాన్నే తీసుకోవాలని ఆదేశించింది. జైల్లోని ఆహారం వల్ల ఏవైనా సమస్యలు వస్తే అప్పుడు చూసుకుందామని తెలిపింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జైల్లో బెడ్ ఏర్పాటు చేసేందుకు అనుమతించింది.

ఈ నెల 2న మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈడీ కార్యాలయంలో విచారణ జరిపిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆయనపై సీబీఐ కూడా అవినీతి కేసు నమోదు చేసింది. అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీసు అధికారి పరంబీర్ సింగ్ రూ. 100 కోట్ల అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదైంది.


More Telugu News