'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డును బాబర్ కు ఇవ్వకపోవడంపై అక్తర్ అసంతృప్తి

  • ముగిసిన టీ20 వరల్డ్ కప్
  • టైటిల్ విజేతగా అవతరించిన ఆస్ట్రేలియా
  • ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా డేవిడ్ వార్నర్
  • 289 పరుగులు చేసిన వార్నర్
  • 303 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన బాబర్
టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఆస్ట్రేలియా జట్టు జగజ్జేతగా నిలిచింది. ఆసీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు ప్రదానం చేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్ లో 7 మ్యాచ్ లలో 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది.

అయితే, వార్నర్ కంటే అత్యధిక పరుగులు చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ కు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ' అవార్డు ఇవ్వకపోవడం పట్ల మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్ ను కాదని వార్నర్ ను ఎంపిక చేయడం అనైతికం అని విమర్శించాడు.

బాబర్ అజామ్ టీ20 వరల్డ్ కప్ లో 60.60 సగటుతో 303 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ మెగా ఈవెంట్లో బాబర్ ను మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ గా ఎంపిక చేస్తారని ఆశించానని, కానీ టోర్నీ నిర్వాహకులు సరైన నిర్ణయం తీసుకోలేదని అక్తర్ పేర్కొన్నాడు.


More Telugu News