అది పవన్ పై దిల్ రాజుకున్న నమ్మకమట!

  • పవన్ నుంచి రానున్న 'భీమ్లా నాయక్'
  • దిల్ రాజు చేతికి నైజామ్ హక్కులు
  • దర్శకుడిగా సాగర్ కె చంద్ర
  • వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు  
నిర్మాతగా ..  డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి మంచి అనుభవం ఉంది. ఏ కథ ఏ తరహా ఆడియన్స్ కి బాగా పడుతుందనేది ఆయనకి బాగా తెలుసు. అలాగే ఏ హీరోకి ఏ స్థాయి మార్కెట్ ఉందనే విషయంలో ఆయనకి స్పష్టత ఉంది. ఒక డిస్ట్రిబ్యూటర్ గా నైజాం ఏరియాపై ఆయనకి మంచి పట్టు ఉంది.

ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ హీరోగా చేసిన 'భీమ్లా నాయక్' నైజామ్ ఏరియా హక్కులను దిల్ రాజు తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందుకోసం ఆయన 40 కోట్లు పెట్టాడని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం పెట్టడానికి పూనుకోవడమనేది సాహసమేనని అంటున్నారు.

అయితే పవన్ కల్యాణ్ కి గల క్రేజ్ పై .. ఆయన మార్కెట్ పై గల నమ్మకంతోనే దిల్ రాజు రంగంలోకి దిగాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు పవన్ తో దిల్ రాజు 'వకీల్ సాబ్' చేసిన సంగతి తెలిసిందే.


More Telugu News