ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. అప్డేట్స్ ఇవిగో!
- గత 24 గంటల్లో 10,229 కేసుల నమోదు
- కరోనా నుంచి కోలుకున్న 11,926 మంది
- దేశ వ్యాప్తంగా 125 మంది మృతి
మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 10,229 కొత్త కేసులు నమోదయ్యాయి. 125 మంది మహమ్మారి కారణంగా మృతి చెందారు. మరోవైపు సగానికి పైగా కేసులు కేరళలోనే నమోదయ్యాయి. కేరళలో నిన్న 5,848 కేసులు నమోదు కాగా... 46 మంది మృతి చెందారు.
ప్రస్తుతం దేశంలో 1,34,096 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 523 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. రికవరీ రేటు ప్రస్తుతం 98.26 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 11,926 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,38,49,785కి పెరిగింది. మరోవైపు 1,12,34,30,478 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఇప్పటి వరకు వేశారు. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.