భక్తులతో పోటెత్తిన యాదాద్రి పుణ్యక్షేత్రం

  • నేడు కార్తీక దశమి
  • భారీగా తరలివచ్చిన భక్తులు
  • పెద్ద ఎత్తున వ్రతాలు, కార్తీక దీపారాధనలు
  • క్రిక్కిరిసిపోయిన దర్శన, లడ్డూ క్యూలైన్లు
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కార్తీకమాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. నేడు ఆదివారం కార్తీక దశమి కావడంతో భక్తులు యాదాద్రికి పోటెత్తారు. వ్రతాలు, కార్తీక దీపారాధన కోసం భారీగా తరలివచ్చారు. స్వామివారి దర్శన క్యూలైన్లతో పాటు లడ్డూ క్యూలైన్లు కూడా క్రిక్కిరిసిపోయాయి. కొండపైన ఎక్కడ చూసినా భక్త జన సందోహం నెలకొంది.

భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. ఇక, యాదాద్రి బాలాలయంలో నిర్వహించిన స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


More Telugu News