అది దస్తగిరి వాంగ్మూలం మాత్రమే... సీబీఐ రిపోర్టు కాదు: చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి
- రెండేళ్ల కిందట వివేకా హత్య
- వివేకా హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం
- దస్తగిరి వెల్లడించిన విషయాలతో తీవ్ర కలకలం
- అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను ఇరికించే కుట్ర అన్న శ్రీకాంత్ రెడ్డి
వైఎస్ వివేకానందరెడ్డి హత్యను రాజకీయాలతో ముడిపెడుతున్నారంటూ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దస్తగిరి ఇచ్చింది వాంగ్మూలమేనని, అది సీబీఐ నివేదిక కాదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
వివేకా మరణానంతరం తీవ్ర విచారంలోనూ సీఎం జగన్ సీబీఐ విచారణ కోరారని వెల్లడించారు. ఈ కేసులో కర్ణాటక వ్యక్తులు కూడా ఉండడంతో సీబీఐ విచారణ కోరారని శ్రీకాంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజల గురించి, రాష్ట్రం గురించి ఆలోచించకుండా ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెడుతోందని విమర్శించారు. వివేకా మరణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.