అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు

  • అండమాన్ సముద్రంలో అల్పపీడనం
  • రేపు బంగాళాఖాతంలో ప్రవేశించే అవకాశం
  • వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
  • ఏపీకి భారీ వర్ష సూచన
అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.

కాగా, అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బంగాళాఖాతంలో ప్రవేశించి మరింత బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. నవంబరు 18న అది ఏపీ తీరాన్ని తాకనుందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ, తెలంగాణ, ఒడిశా, దక్షిణ చత్తీస్ గఢ్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది.


More Telugu News